50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం

దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

Updated : 18 Apr 2024 06:43 IST

వాల్మీకి క్షేత్రంలో అరుదైన ఘట్టం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీపట్టాభి రామాలయంలో మాత్రం సీతమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేష రోజున చేస్తారు. 50 ఏళ్లకు ఒకసారి పునర్వసు, ఆశ్లేష నక్షత్రాల కలయిక ఈ శ్రీరామనవమి రోజు రావడంతో బుధవారం జగదభిరాముడి పరిణయ ఘట్టం కనులపండువగా సాగింది. ఇలా 1975లో నవమి రోజు కల్యాణం చేయగా, మళ్లీ అర్ధ శతాబ్దం ముగిశాక ఈ ఏడాది అలాంటి ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనం రామనామ స్మరణల మధ్య కల్యాణ వేడుక వైభవంగా జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని