సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు

సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Published : 18 Apr 2024 05:12 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలో తెలుగువారి సత్తాను చాటిన దోనూరు అనన్యరెడ్డి, నందాల సాయికిరణ్‌, కేఎన్‌ చందనజాహ్నవి, మెరుగు కౌశిక్‌, మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూషలకు ప్రత్యేక అభినందనలు. నిస్వార్థ సేవతో ప్రజాసేవ చేసి పదవులకు వన్నె తెస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా బుధవారం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని