వినూత్న ‘సైకిల్‌’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!

రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

Updated : 19 Apr 2024 09:48 IST

ఈనాడు, చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. చిత్తూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌కు మద్దతుగా కొందరు వినూత్న ప్రచారం చేపట్టారు. ఆరుగురు యువకుల బృందం ‘యూని’ సైకిళ్లతో వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వీటికే చిన్నపాటి మైకులు అమర్చుకున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలంటూ వారు చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు