తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది.

Published : 19 Apr 2024 06:11 IST

ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుపై వైకాపా సర్కారు నిర్లక్ష్యం

కుక్కునూరు, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంతో అక్కడంతా సస్యశ్యామలంగా ఉండగా, మన రాష్ట్ర పరిధిలోని కాలువలు మరమ్మతులు లేక అడవులను తలపిస్తున్నాయి.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద 1976లో నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కింద ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సాగు నీరు కేటాయించారు. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు కింద ఏపీలో 12 వేలు, తెలంగాణలో 4 వేల ఎకరాలకు నీరందించాలి.

కాలువల మరమ్మతులకు రూ.70 కోట్లతో అంచనాలు రూపొందించగా, ఏపీ, తెలంగాణలు 70:30 నిష్పత్తి చొప్పున ఖర్చు భరించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం తన పరిధి వరకు మరమ్మతులు చేపట్టింది. ప్రస్తుతం అక్కడి రైతులకు సాగునీరు సరఫరా అవుతుండగా, కింది భాగంలోని ఆంధ్రా ఆయకట్టుకు నీరొచ్చే అవకాశమే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని