శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం

శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు.

Updated : 19 Apr 2024 06:41 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి8 నుంచి 9గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి.. శ్రీరామపట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం సుగ్రీవుడు, అంగదుడి ఉత్సవమూర్తులతోపాటు ఆంజనేయ స్వామివారికి పుష్పమాలలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని