ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం

కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది.

Published : 19 Apr 2024 04:12 IST

పంచాయతీలకు రూ.998 కోట్ల విడుదల

ఈనాడు, అమరావతి: కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.998.82 కోట్లను గురువారం విడుదల చేసింది. వీటిని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల బ్యాంకు ఖాతాలకు పంచాయతీరాజ్‌శాఖ శుక్రవారం నుంచి జమ చేయనుంది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఏకపక్షంగా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నిధులను కూడా మళ్లించిందేమోననే అనుమానాలు సర్పంచుల్లో వ్యక్తమయ్యాయి. ఈ నెల 13న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘రూ.988 కోట్ల పంచాయతీ నిధుల మళ్లింపు?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. మరోవైపు ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఈ నెల 15న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గురువారం ఒకే రోజు ఆరు జీవోలు విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని