దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి

ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్‌ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

Updated : 19 Apr 2024 05:31 IST

హైకోర్టును గడువు కోరిన ఈసీ
విచారణ 23కి వాయిదా

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్‌ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. దస్తగిరి తమకు సమర్పించిన వినతిపై తీసుకున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌దేశాయ్‌ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్‌తరఫు న్యాయవాది వాదనలువినిపిస్తూ..‘రానున్న ఎన్నికల్లో పిటిషనర్‌ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగేలా నేతలు వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలి. వాటిని ప్రసారం చేయకుండా టీవీ ఛానళ్లను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలి. ఈ వ్యవహారంపై ఈసీకి వినతి ఇచ్చాం’ అని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు. ఈసీ వివరాలు సమర్పించాక తగిన ఉత్తర్వులిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని