అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు

స్కిల్‌ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.

Published : 19 Apr 2024 04:17 IST

స్కిల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: స్కిల్‌ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. విచారణను మే 8కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. విచారణ సందర్భంగా సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. అదనపు దస్త్రాలను కోర్టు ముందు ఉంచేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని