పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్‌లో ఐఏఎస్‌ల కమిటీ భేటీ

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్‌ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది.

Published : 19 Apr 2024 04:18 IST

చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనంటున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్‌ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగుల్లో చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి కమిటీ నివేదికకు ఎన్నికల ముందే ఆమోదముద్ర వేయించే కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసినా దాన్ని పట్టించుకోకుండా కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో నష్టపోయే ఉద్యోగులతో చర్చించాలని తమకు సూచించలేదని ఐఏఎస్‌ అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న కొందరు ఐఏఎస్‌లపై పలు ఆరోపణలున్నట్లు పేర్కొంది. మధ్యస్థాయి అధికారుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రభుత్వం ముగింపు పలుకుతోందని.. దీని వెనక కుట్ర ఉందని ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని