మాచర్లలో కూలిన వసతిగృహం గోడ

పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది.

Published : 19 Apr 2024 05:05 IST

విద్యార్థినులకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. అప్పుడే పరీక్షలు రాసి పాఠశాలల నుంచి వసతిగృహానికి చేరుకున్న విద్యార్థినులు ఆ దృశ్యాన్ని చూసి భయపడి బోరున విలపించారు.

గోడ కూలిన సమయంలో దాని సమీపంలోనే కొంతమంది విద్యార్థినులు ఉన్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే అటువైపు వెళ్లే వాళ్లమని, ఆ పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందని వారు వాపోయారు. కూలిన శబ్దానికి చుట్టుపక్కల వారు సైతం భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు వసతిగృహంలో వార్డెన్‌, వాచ్‌మెన్‌లు ఎవరూ లేరు. ఘటనపై వార్డెన్‌ సుమని మాట్లాడుతూ.. వసతిగృహం విద్యార్థినులకు అనువుగా లేదని, శిథిలావస్థకు చేరడంతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని