మంచాలలో ప్రబలిన అతిసారం

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

Published : 20 Apr 2024 06:17 IST

వంద మందికిపైగా అస్వస్థత

చేబ్రోలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొంతమంది తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో వారిని గుంటూరు, వడ్లమూడి, చేబ్రోలులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరికొంతమంది స్థానిక ఆర్‌ఎంపీ సహాయంతో ఇంటి వద్దే వైద్యం పొందుతున్నారు. బాధితులంతా పొలం పనులు చేసుకునే కూలీలే. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ అతిసారం ప్రబలడానికి గల కారణాలను గుర్తిస్తున్నామన్నారు. ఇటీవల ఆలయం వద్ద అందించిన పానకాన్ని నిల్వ ఉంచి తాగడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని