భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసింది.

Updated : 20 Apr 2024 06:39 IST

2023-24లో రూ.1,161 కోట్ల ఎఫ్‌డీ
బంగారం 1,031 కిలోలు

తిరుమల, న్యూస్‌టుడే: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసింది. తితిదే ఇప్పటివరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. దీంతో తితిదే ఫిక్సిడ్‌ డిపాజిట్లు మొత్తం రూ.18 వేల కోట్లకు చేరాయి. కరోనా తర్వాత నుంచి స్వామి వారికి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1,031 కిలోల బంగారం డిపాజిట్‌ చేయగా మొత్తంగా 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా తితిదేకు రూ.1,200 కోట్ల వడ్డీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని