ఎన్‌ఎస్‌జీ డీజీగా నళిన్‌ ప్రభాత్‌

జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌గా నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.

Updated : 20 Apr 2024 06:39 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌గా నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందిస్తున్న ఆయనకు డీజీగా పదోన్నతి కల్పించి ఎన్‌ఎస్‌జీ బాధ్యతలు అప్పగించారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసింది. దేశంలోని వీఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఈ దళం చూస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని