తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు

శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

Updated : 20 Apr 2024 06:39 IST

తిరుమల, న్యూస్‌టుడే: శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పాపవినాశనం రోడ్డుకు సమీపంలోని శ్రీగంధం పార్కుకు కొద్దిదూరంలో అన్నమయ్య మార్గం వద్ద మంటలు వ్యాపించగా ఆర్పేందుకు అటవీ, అగ్నిమాపక సిబ్బంది దాదాపు వందమంది తీవ్రంగా శ్రమించారు. సాయంత్రానికి అదుపులోకి తీసుకురాగలిగారు. ఇప్పటికే తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్‌ రోడ్డు పరిధిలో చెట్లకు మంటలంటుకొని మూడు రోజుల కిందటి వరకూ వ్యాపించి, చల్లారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని