సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్‌రెడ్డి

‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Apr 2024 05:11 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల వైకాపాను వీడి తెదేపాలో చేరారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అల్లంపాడులో బుధవారం నిర్వహించిన రచ్చబండలో మేకపాటి మాట్లాడుతూ.. ‘యానాదోళ్ల అమ్మాయి వెళ్లడం ద్వారా మాకు ఇంకా మేలు జరిగింది. డబ్బులు ఇస్తామంటే వెళ్లారు. వాలంటీరుగా ఉన్న ఆమెను గౌతమ్‌రెడ్డి ఛైర్‌పర్సన్‌ చేశారు..’ అని అన్నారు. రాజమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ఛైర్‌పర్సన్‌ను ఇలా కించపరచడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని