సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన

కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Published : 20 Apr 2024 05:11 IST

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌ (కాకినాడ), వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి 1,200 వరకు ఆర్టీసీ బస్సులను మళ్లించారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనే 314 ఆర్టీసీ బస్సులను సభకు మళ్లించారు. పలు మార్గాల్లో బస్సులు రద్దుకావడంతో ఉదయం నుంచి ఉద్యోగాలు, అత్యవసర పనులు, విద్యాలయాలకు వెళ్లాల్సిన ప్రయాణికులంతా గంటల తరబడి నిరీక్షించారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు నాలుగు గంటల పాటు నాన్‌స్టాప్‌ సర్వీసులు అందుబాటులో లేక అవస్థలు ఎదుర్కొన్నారు. జగన్‌ బస్సు యాత్ర సాగే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో మిట్టమధ్యాహ్నం వాహన చోదకులు, ప్రయాణికులు విలవిల్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని