జనం కళ్లలో జగన్‌ దుమ్ము

సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి.

Published : 20 Apr 2024 05:23 IST

సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. ఉమ్మడి  జిల్లాలో ఈ రోడ్డు చాలా కీలకమైనది. రాజమహేంద్రవరం పక్కన రాజానగరం నుంచి కాకినాడ వరకు 30 కి.మీ. మేర ఉంటుంది. 2018లో రూ. 293 కోట్లతో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో చురుగ్గా జరిగాయి. వైకాపా వచ్చాక గుత్తేదారుకు రూ. 45 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేశారు. ఎక్కడికక్కడ గుంతలతో నిండిపోయిన ఈ మార్గంలో తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ద్విచక్ర వాహనదారులకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వస్తున్నారని ఈ రోడ్డుపై గుంతలను రాత్రికి రాత్రే పూడ్చారు. మరికొన్నిచోట్ల నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. సీఎం కాన్వాయ్‌ రాజానగరం నుంచి రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట మీదుగా కాకినాడ గ్రామీణ మండలంలోని అచ్చంపేట కూడలికి వెళ్తుండగా ఇలా విపరీతమైన దుమ్ము లేచింది. అయిదేళ్లుగా జనం కళ్లలో రోజూ ఇంతకుమించి దుమ్ము పడుతూనే ఉంది.

ఈనాడు, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని