జగన్‌ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు

సీఎం జగన్‌ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు.

Published : 20 Apr 2024 05:12 IST

అడ్డుకునేందుకు కొందరు పోలీసుల అత్యుత్సాహం

ఈనాడు-కాకినాడ, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-సర్పవరం జంక్షన్‌: సీఎం జగన్‌ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. ఈయన మాట్లాడుతుండగా కొందరు వెనుదిరగడం ప్రారంభించారు. తర్వాత సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగా ఈ సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో సభా ప్రాంగణం ముఖద్వారం వద్ద విధుల్లో ఉన్న ఓ సీఐ.. జనం బయటకు వెళ్లకుండా నిలువరించాలంటూ హుకుం జారీచేశారు. దీంతో సిబ్బంది అడ్డుగోడలా నిలబడ్డారు. ఎండవేడి తాళలేక చిన్నారులు ఏడుస్తుండటంతో.. పోలీసుల తీరుపై కొందరు అసహనం వ్యక్తంచేశారు. ఎక్కువమంది ఒకేసారి వెళ్లడానికి ప్రయత్నించడంతో చేసేది లేక వదిలేశారు.

సీఎం ర్యాంప్‌ వాక్‌..: సిద్ధం సభ ప్రారంభానికి ముందు సీఎం జగన్‌ ర్యాంపుపై చివరివరకు నడిచి అందరికీ అభివాదం చేశారు. అప్పటికే చివరి గ్యాలరీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా.. ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొందరు విసిగి వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని