రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు.

Published : 20 Apr 2024 05:22 IST

నామినేషన్ల వేళ ఎన్నికల నిబంధనలకు తూట్లు

ఆచంట, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. ఆచంట వైకాపా అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తెదేపా కూటమి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ శుక్రవారం నామినేషన్లు వేశారు. ఇదే సమయంలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు భోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం సాదాసీదాగా కనిపించిన టెంట్‌లోకి భోజనాల వేళకు వేల మంది వైకాపా కార్యకర్తలు వచ్చి చేరారు. ఇక్కడ రైతు సదస్సు నిర్వహించడానికి సాయిరాం ఎంటర్‌ప్రైజస్‌, లక్ష్మీ పద్మావతి ఏజెన్సీస్‌ డీలర్లు ఆన్‌లైన్లో అనుమతులు కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ వేస్తున్నారని తెలిసినా అధికారులు అనుమతులు ఎందుకు రద్దు చేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు