వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్‌ కేసులు.. అఫిడవిట్‌లో పేర్కొన్న అవినాష్‌రెడ్డి

వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి తాను రెండు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Updated : 20 Apr 2024 06:38 IST

ఈనాడు, కడప: వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డి తాను రెండు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ వివిధ సెక్షన్ల కింద హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో కేసు పెట్టిందని చెప్పారు. మైదుకూరులో కూడా ఓ క్రిమినల్‌ కేసు నమోదైందని పేర్కొన్నారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్య కేసుకు సంబంధించి దిల్లీ సీబీఐ కార్యాలయంలో తనపైన కేసులు నమోదైనట్లు వివరించారు. నేరపూరిత కుట్ర, హత్యానేరానికి సంబంధించిన కేసుల వివరాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-8గా ఉన్నట్లు, ఇదే కేసుకు సంబంధించి సీబీఐ కోర్టుకు పూచీగా డిపాజిట్‌ చేసిన రూ.2 లక్షల నగదు వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రూ.25.51 కోట్ల ఆస్తులు: తనకు రూ.32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు, తనతో పాటు, భార్య సమత పేరుపై రూ.25,51,19,305 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అవినాష్‌రెడ్డి అఫిడవిట్‌లో వెల్లడించారు. పులివెందుల మండలం వెలమవారిపల్లె, భాకరాపురం, అంకాళమ్మగూడూరు ప్రాంతాల్లో 27.40 ఎకరాలు, భార్య పేరిట విశాఖపట్నం, వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టలో 33.90 ఎకరాల భూములున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని