రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు

వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు.

Published : 20 Apr 2024 05:22 IST

ఈనాడు, చిత్తూరు: వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. 2019 స్థిరాస్తులు రూ.4.64 కోట్లుండగా, ప్రస్తుతం రూ.6.05 కోట్లు. ఐదేళ్లలో రూ.81 లక్షలు పెరిగాయి. 2019లో ఆరు కార్లు, ఒక బైక్‌ ఉండగా, వాటి విలువ రూ.1.08 కోట్లు. నేడు 9 కార్లుండగా.. విలువ రూ.1.59 కోట్లు. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా, ఇప్పుడు ఒక్కటీ లేదు. ఆమె ఇంటర్‌ వరకు చదివారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో (చిట్‌ నంబర్‌ ఎల్‌టీ030వీ ఎంఏ/48) రూ.39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో ప్రైవేటు చిట్‌లోనూ ఆమెకు రూ.32,90,450 విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని