ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి

విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది.

Updated : 20 Apr 2024 06:01 IST

ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. మంత్రి పేరిట చరాస్తులు రూ.3.78 కోట్లు. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి పేరిట చరాస్తి రూ.4.75 కోట్లు. అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్‌) రూ.35.04 లక్షలు ఉంది. స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట రూ.6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.1.08 కోట్ల విలువైనవి ఉన్నాయి. మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.21.19 కోట్లు. 2019 అఫిడవిట్‌ ప్రకారం రూ.8.23 కోట్లు మాత్రమే. మంత్రికి రూ.15.95 లక్షల విలువైన కారు, ఝాన్సీకి రెండు కార్లు (రూ.73.33 లక్షలు, రూ.8 లక్షలు) ఉన్నాయి. బొత్స వద్ద రూ.20.15 లక్షల విలువైన 31 తులాల బంగారం, ఝాన్సీలక్ష్మి వద్ద రూ.2.11 కోట్ల విలువైన 325 తులాల బంగారముంది. అప్పులు రూ.4.24 కోట్లు ఉండగా, ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నవే. వీరిపై కేసుల్లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని