సారొస్తున్నారు..దుకాణాలు మూసేయండి!

ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్ర జరిగే మార్గంలోని చెట్ల కొమ్మలను జీవీఎంసీ సిబ్బంది నరికేస్తున్నారు.

Published : 21 Apr 2024 05:25 IST

సీఎం బస్సు యాత్ర నేపథ్యంలో అధికారుల ఆదేశం

ఈనాడు, విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్ర జరిగే మార్గంలోని చెట్ల కొమ్మలను జీవీఎంసీ సిబ్బంది నరికేస్తున్నారు. అసలే వేసవి ఎండలు మండిపోతుంటే.. నీడనిచ్చే పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేయడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మార్గంలో రోజంతా దుకాణాలు తెరవొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలా అయితే తమకు ఉపాధి ఎలా అని బడుగు జీవులు ప్రశ్నిస్తున్నారు. శనివారం అనకాపల్లిలో సీఎం యాత్ర నేపథ్యంలో ఎలమంచిలి వెళ్లే వాహనాలను లంకెలపాలెం మీదుగా ఫార్మాసిటీ వైపు మళ్లించడంతో మూడు కి.మీ. మేర రద్దీ ఏర్పడింది. అగనంపూడి నుంచి లంకెలపాలెం 8 కి.మీ. దూరం చేరుకోవడానికి 40 నిమిషాల సమయం పట్టడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని