తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

Updated : 22 Apr 2024 07:02 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల కోసం సప్తగిరులు తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి, వసంత మండపంలో వేంచేపు చేశారు. అనంతరం ఆస్థానం, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఉత్సవంలో పెద్దజీయర్‌, చినజీయర్‌, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారిని స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం వసంతోత్సవం నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని