ఒంటిమిట్టలో నేడు సీతారాముల కల్యాణం

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.

Published : 22 Apr 2024 05:25 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున స్వామివారి పెళ్లి వేడుక జరుగుతుంది. ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండువెన్నెల్లో కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి ఒక్కరికీ ముత్యాల తలంబ్రాలు, తిరుమల నుంచి తెప్పించిన చిన్న లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున కల్యాణోత్సవానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బదులు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ హాజరై పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు