బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు

ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Published : 22 Apr 2024 05:28 IST

ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకెళ్దామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జేఎన్‌టీయూ సమీపాన ఆర్జేసీ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఉద్యోగులకు రూ.25వేల కోట్లకు పైగా బకాయిలున్నాయి. ప్రతి సంవత్సరం కరవు భత్యం, పీఆర్సీ, ఇతర బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై ఉద్యోగుల్లో ఆయోమయం నెలకొంది. ఉద్యోగ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీపీఎస్‌ ఉద్యోగులకు కరవు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుంది’ అని సూర్యనారాయణ పేర్కొన్నారు. సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర సహాధ్యక్షుడు కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్‌, ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని