పరుగులు పెడుతున్న ఏపీ గ్రిడ్‌

రాష్ట్రంలో గ్రిడ్‌ డిమాండ్‌ సరికొత్త రికార్డును ఆవిష్కరించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం 13,319 మెగావాట్ల గ్రిడ్‌ డిమాండ్‌ నమోదైంది.

Updated : 22 Apr 2024 06:41 IST

రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గ్రిడ్‌ డిమాండ్‌ సరికొత్త రికార్డును ఆవిష్కరించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం 13,319 మెగావాట్ల గ్రిడ్‌ డిమాండ్‌ నమోదైంది. గతేడాది మార్చి 7న నమోదైన 13,255 మెగావాట్ల డిమాండే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరిగినా గ్రిడ్‌కు ఇబ్బంది లేకుండా రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) సమన్వయం చేసింది. ఎక్కడా సరఫరాలో అంతరాయం తలెత్తలేదు. మరోపక్క, రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు సగటున 242.65 మిలియన్‌ యూనిట్లుగా ఉంటోంది. గతేడాది ఇదే సీజన్‌లో 231.65 ఎంయూలుగా ఉంది. గతేడాది జూన్‌ 16న మూడు డిస్కంల పరిధిలో నమోదైన 263.23 ఎంయూలే ఇప్పటి వరకు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌గా ఉంది.

ఏపీ జెన్‌కో, కేంద్ర ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్‌, స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్‌ పోనూ.. డిమాండ్‌ మేరకు సరఫరా చేసేందుకు రియల్‌ టైం మార్కెట్‌, డే అహెడ్‌ మార్కెట్‌ నుంచి 15.32 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు కొంటున్నాయి. స్వాపింగ్‌ విధానంలో 4.8 ఎంయూలు పొందుతున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, పీపీఏల ద్వారా అందే విద్యుత్‌ పోనూ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 40.955 ఎంయూల విద్యుత్‌ను తీసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని