ఒంటిమిట్టలో రాములోరి వైభవం

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు.

Updated : 23 Apr 2024 07:06 IST

ఘనంగా సీతారామ కల్యాణం

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. తితిదే ఆధ్యర్యంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే తరఫున కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి రూ.31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అందజేశారు. తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పర్యవేక్షణలో పరిణయ ఘట్టం నయనానందకరంగా సాగింది. ప్రధాన వేదికను ఫల, పుష్ప, పత్రాలతో మనోహరంగా తీర్చిదిద్దారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ముత్యాల తలంబ్రాలు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రామయ్య క్షేత్రం నుంచి కల్యాణవేదిక వరకు కనులపండువగా శోభాయాత్ర సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని