ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే

సీఎం జగన్‌ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు.

Published : 23 Apr 2024 08:11 IST

సీఎం ‘సిద్ధం’ సభలకు 1100 ఆర్టీసీ బస్సుల కేటాయింపు

విజయనగరం కోట, కల్టెకరేట్‌ ప్రాంగణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలిస్తుండటంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గమ్యస్థానాలకు వెళ్లే బస్సులు అందుబాటులో ఉండక బస్టాండ్లలోనూ, రోడ్లపైనా గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. మండుటెండలతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మంగళవారం విజయనగరం, బుధవారం శ్రీకాకుళం జిల్లాల్లో సిద్ధం సభలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని డిపోల నుంచి 1100కు పైగా బస్సులు కేటాయించేశారు. ఈ రెండు రోజుల కోసం ఒక్క విజయనగరం నుంచే 125లో 90కి పైగా బస్సులు వెళ్లనున్నాయి. ఈ నెల 23, 24, 25, 26వ తేదీల్లో పెద్దఎత్తున పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సులను బుక్‌ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించినా..అధిక ఛార్జీలతో పెనుభారం పడుతోందని బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని