జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు  కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లోని తారకరామనగర్‌కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్‌ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు.

Updated : 23 Apr 2024 08:28 IST

బుగ్గన నామినేషన్‌ ర్యాలీకి అడ్డొస్తున్నాయని డోన్‌లో చెట్ల కొమ్మల నరికివేత

డోన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు  కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లోని తారకరామనగర్‌కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్‌ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. సోమవారం వైకాపా అభ్యర్థిగా బుగ్గన నామినేషన్‌ వేసే కార్యక్రమం సందర్భంగా ఆ మార్గంలోని పచ్చని చెట్లను.. మున్సిపల్‌ సిబ్బందితోనే కొట్టించేయడం గమనార్హం.

రోడ్డుపైనే మద్యం తాగుతూ.. మంత్రి బుగ్గన నామినేషన్‌ వేయడానికి నిర్వహించిన ర్యాలీలో.. వైకాపా కార్యకర్తలు ఎక్కడికక్కడ మద్యం తాగుతూ కనిపించారు. ఆర్వో కార్యాలయం, పట్టణ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ప్రధాన రహదారుల్లో గ్లాసుల్లో పోసి తాగేశారు. ప్రధాన రహదారిలో యథేచ్ఛగా మద్యం తాగుతున్నా.. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని