ఏపీ టెన్త్‌ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100..

Updated : 23 Apr 2024 10:09 IST

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: 100, 99, 100, 100, 100, 100.. ఇవేంటని సందేహిస్తున్నారా? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించారు. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్‌, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్‌ కూడా ఎంతగానో పనికొచ్చిందని మనస్వీ తెలిపారు. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని