వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?

వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

Updated : 23 Apr 2024 06:45 IST

పింఛన్‌ ఇప్పిస్తానని చెప్పి మూడేళ్లు దాటింది!

ఈ చిత్రంలో అన్నం తింటున్న అంధురాలి పేరు జువ్వల భాగ్యవతి(64). భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయి అనాథగా మిగిలిపోయారు. మానసిక అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. ప్రస్తుతం చెల్లెలి కుమార్తె రాజశ్రీ వద్ద ఉంటున్నారు. వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 18న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఓట్లడిగేందుకు వచ్చిన అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు గోడు చెప్పుకొన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు కాగానే ఇప్పిస్తానని మంత్రి మాటిచ్చారు. ఆ ఎన్నికలై మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ పింఛను ఊసే లేదు. ‘‘అవ్వాతాతలకు అండగా ఉంటా, పింఛన్లు ఇంటికే తెచ్చి ఇస్తా’ అని ఊదరగొట్టే సీఎం జగన్‌ మాటలకు.. వాస్తవాలకు ఎంత తేడా ఉందో చెప్పడానికి విజయవాడ వన్‌టౌన్‌లోని గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన భాగ్యవతి కన్నీటి వ్యధే ప్రత్యక్ష సాక్షం. 

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు