‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు.

Updated : 23 Apr 2024 06:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. బాలురలో 2,856 మందికి 2,808, బాలికల్లో 2,498 మందికి 2,462 మంది ఉత్తీర్ణులయ్యారని ఓ ప్రకటనలో తెలిపారు. తమ విద్యార్థులైన సత్యసాయి జిల్లా గుడిబండకు చెందిన గోసుల గోపిక 596, తిరుపతి జిల్లా దొరవారిసత్రానికి చెందిన పాంచజన్య 595 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు.

గురుకులాల్లో 94.56 శాతం ఫలితాలు

పదో తరగతి ఫలితాల్లో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 94.56 శాతం ఫలితాలు నమోదైనట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రకటించారు. 13,761 మంది విద్యార్థులకు 13,012 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ‘42 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాం. 97.14 శాతంతో చిత్తూరు మొదటి స్థానం కైవసం చేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి బాలికల గురుకులానికి చెందిన ధోనికా 594 మార్కులు సాధించి మొదటి స్థానం పొందింది. శ్రీకాళహస్తికి చెందిన తులసి 589 మార్కులతో ద్వితీయ, బాపట్ల జిల్లా నర్సాయపాలెం విద్యార్థిని హారిక 587 మార్కులతో తృతీయ స్థానాల్లో నిలిచారు’ అని వెల్లడించారు.

  • విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆ శాఖ సంచాలకుడు రవిప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. వీరిలో 20 మంది అంధ, 38 మంది బధిర విద్యార్థులున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

పదో తరగతి పరీక్షల్లో బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు 87.15 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు బీసీ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాదితో పోలిస్తే 15 శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు వెల్లడించింది. సింగరాయకొండ విద్యార్థి రేవంత్‌కుమార్‌, గాలిజేరుగుల్ల విద్యార్థి వేంకట భరత్‌లు  589 మార్కులతో మొదటి స్థానం, తిరుపతికి చెందిని విద్యార్థిని పూజ, చిత్తమూర్‌కు చెందిన జశ్వంత్‌లు 587 రెండో స్థానం, ఆత్మకూరు, నర్సిపట్నం విద్యార్థునులు హలీమ సాదియా, హైమా లక్ష్మణ కుమారిలు 586 మార్కులతో మూడో స్థానాన్ని సాధించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని