వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్‌, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ.

Updated : 23 Apr 2024 06:48 IST

హైకోర్టులో వ్యాజ్యం.. నేడు విచారణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్‌, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వారి రాజీనామాలను అంగీకరిస్తే వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వారు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఈసీ ఇప్పటికే నిర్ధారించిందని.. ఈ దశలో వారి రాజీనామాలను అంగీకరిస్తే ఆ పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ క్రమంలో అధికారులకు సూచించేలా ఈసీని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర అభ్యర్థించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ స్పందిస్తూ.. మంగళవారం విచారణ జరుపుతామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని