విద్య కమిషనరేట్‌లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం

ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్‌ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్‌ జారీ చేసింది.

Updated : 23 Apr 2024 06:45 IST

ప్రభుత్వం గెజిట్‌ జారీ

ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్‌ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్‌ జారీ చేసింది. ఆదర్శ పాఠశాలల టీచర్లు ఇదివరకు సొసైటి కింద ఉండగా.. వీరికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 163 ఆదర్శ పాఠశాలల్లోని 3,260 పోస్టుల(163 ప్రిన్సిపాళ్లు, 1,956 పీజీటీలు, 1,141 టీజీటీ) వేతనాల కోసం గతంలోని 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా ఉండేందుకు.. ఎస్జీటీ పోస్టులను రద్దు చేసి, ఆదర్శ పాఠశాలల పోస్టులను తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసిందని చర్చించుకుంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ కీలక రాజకీయ నేత సిఫార్సు మేరకు సర్కారు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు టీచర్ల నుంచి కొంతమొత్తం వసూలు చేసినట్లూ ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు