పోస్టల్‌ బ్యాలెట్‌పై స్పష్టతనివ్వాలి

 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. 

Updated : 23 Apr 2024 06:55 IST

సీఈవోకు వీఆర్వోల సంఘం విజ్ఞప్తి

ఈనాడు-అమరావతి: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. స్వస్థలాలకు దూరంగా విధుల్లో ఉన్న వీఆర్వోలు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవడానికి కొన్ని జిల్లాల్లో మాత్రమే అనుమతిస్తున్నారని తెలిపింది. బీఎల్‌వోలకు బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని చెల్లించాలని కోరింది.


సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను నింపాలి: సీఎస్‌ జవహర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులన్నింటినీ నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ ఆదేశించారు. సచివాలయంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ‘సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నింపాలి. ప్రకాశం బ్యారేజికి ఈ నెల 29 వరకు.. నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువకు 25వరకు నీటి విడుదలను కొనసాగించాలి. 1,046 ట్యాంకులకు గాను 680ట్యాంకుల్లో నీటిని నింపాం. మిగతా వాటిని కూడా త్వరగా పూర్తిచేయాలి’ అని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని