ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై క్యాట్‌ విచారణ 29కి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వివాదంపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Updated : 24 Apr 2024 06:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వివాదంపై హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తనను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌లో పిటిషన్‌ వేేశారు. దానిపై క్యాట్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు లతా బస్వరాజ్‌, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యురాలు శాలినీ మిస్త్రాల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఒకే కారణంపై ప్రభుత్వం రెండోసారి సస్పెన్షన్‌ వేటు వేసిందని, పిటిషనర్‌ వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అభియోగ పత్రాన్ని నాలుగుసార్లు ఎలా ఇస్తారని, వివరణ ఇచ్చినా.. ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించాల్సి ఉండటంతో విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని