నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు

రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి.

Published : 24 Apr 2024 06:33 IST

కోస్తా జిల్లాల వాసులకు హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో45.1, విజయనగరం జిల్లా జామిలో 44.9, వైయస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేటలో44.6, కర్నూలు జిల్లా వగరూరులో44.2, అనకాపల్లి జిల్లా దేవరాపల్లెలో 44.1, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో43.8, శ్రీకాకుళం జిల్లా సారవకోట.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొండైగూడెంలో43.7, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, కళింగపట్నం, తుని, విశాఖపట్నంలో సాధారణ ఉష్ణోగ్రతలు 3నుంచి 6డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. బుధవారం46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 143 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

బుధవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: విజయనగరం జిల్లాలో 19, శ్రీకాకుళం 13, పార్వతీపురం మన్యం 11, అనకాపల్లి 3.

వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: తూర్పుగోదావరి జిల్లాలో 19, కాకినాడ18, శ్రీకాకుళం 16, అనకాపల్లి 15, గుంటూరు 13, ఏలూరు 12, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, విజయనగరం 6, కృష్ణా 6, ఎన్టీఆర్‌ 5, పార్వతీపురం మన్యం 4, పశ్చిమగోదావరి 4, విశాఖపట్నం 3, పల్నాడు 2, బాపట్ల 1, తిరుపతి 1.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు