అమరనాథ్‌ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

అమరనాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు.

Updated : 24 Apr 2024 07:17 IST

ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరనాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. స్పెషలిస్ట్‌ వైద్యుల వద్ద ఫిట్‌నెస్‌ పత్రం తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా స్పెషలిస్ట్‌ వైద్యుల వివరాలను   https://www.jksasb.nic.in// వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.


పాలిసెట్‌పై అవగాహనకు గ్రాండ్‌టెస్ట్‌ నేడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాలిసెట్‌-2024 సన్నద్ధత కోసం బుధవారం గ్రాండ్‌టెస్ట్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిసెట్‌ కోసం సాంకేతిక విద్యాశాఖ అందించిన ఉచిత శిక్షణకు ముగింపుగా, ప్రవేశపరీక్షపై అవగాహన కల్పించేలా ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటులో 7,273, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 12,513 మంది శిక్షణ పొందిన విద్యార్థులకు అక్కడే ఈ పరీక్ష ఉంటుంది. దీనికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. పాలిసెట్‌ రాయాలనుకునే విద్యార్థులెవరైనా ఈ  అవకాశాన్ని వినియోగించుకోవచ్చు’ అని పేర్కొన్నారు. ఈనెల 27 పాలిసెట్‌-2024 యథావిధిగా ఉంటుందని నాగరాణి తెలిపారు.


పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టండి

కూలీలకు సకాలంలో నగదు చెల్లించాలి

కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం అనుకూలమైనందున గ్రామ పంచాయతీల్లో పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) జవహర్‌రెడ్డి.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు సకాలంలో నగదు చెల్లించాలన్నారు. గ్రామాల్లో తాగునీరు, ఉపాధి పనులు, విద్యుత్‌ సరఫరా పరిస్థితులపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ప్రకాశం బ్యారేజి నుంచి నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులను నింపాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి కలిగిన ఆవాసాలు, కాలనీలకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలి’ అని అధికారులకు జవహర్‌రెడ్డి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని