సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు

సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు.

Updated : 24 Apr 2024 08:43 IST

సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం నిర్వహించనున్న ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం అక్కవరం సమీపంలో ఓ స్థిరాస్తి వెంచర్‌ను సిద్ధం చేస్తున్నారు. దానికి ఆనుకుని ఉన్న సాగునీటి కాలువను పూర్తిగా పూడ్చేశారు. జాతీయ రహదారి కింది భాగంలో 400 ఎకరాలు, చింతలగార చెరువుకు ఈ కాలువ నుంచే నీరందుతుంది. సభ పూర్తయ్యాక కాలువను పూర్వపు స్థితికి తెచ్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, టెక్కలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని