ఎన్నికల హింస ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated : 18 May 2024 06:30 IST

13 మంది పోలీసు అధికారులతో బృందం
విధి విధానాలను నిర్దేశిస్తూ డీజీపీ ఆదేశాలు
కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల్లో నివేదిక

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. సంబంధిత నివేదికను రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని తెలిపారు. 

సిట్‌ బృందంలో సభ్యులుగా.. 

  • రమాదేవి, ఏసీబీ ఎస్పీ
  • సౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీ
  • రమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ
  • పి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ 
  • వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ 
  • రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీ
  • వి.భూషణం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌  (గుంటూరు రేంజ్‌)
  •  కె.వెంకటరావు, ఇన్‌స్పెక్టర్‌(ఇంటెలిజెన్స్‌), విశాఖపట్నం
  • రామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌
  • జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌
  • మోయిన్, ఇన్‌స్పెక్టర్, ఒంగోలు పీటీసీ
  • ఎన్‌.ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్, అనంతపురం ఏసీబీ
  • శివప్రసాద్, ఇన్‌స్పెక్టర్, ఏసీబీ

  సిట్‌కు పూర్తి అధికారాలు..

  • ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును సిట్‌ సమీక్షిస్తుంది. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన ఘటనలపై సిట్‌ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
  • కేసు విచారణ సంబంధిత ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌(ఐవో) నిర్వహించినా.. దర్యాప్తు తీరును సిట్‌ పర్యవేక్షిస్తుంది.
  • అదనపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి ఐవోకు సిఫార్సు చేస్తుంది. అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుంటుంది.
  • ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి, కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ చేసేలా సిఫార్సు చేస్తుంది. విచారణకు సంబంధించి ఇంకా అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని