సీబీఐ కోర్టుకు హాజరైన అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

Updated : 18 May 2024 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఐదో నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డి, ఏడో నిందితుడైన వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. దస్తగిరి హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోగా కోర్టు అనుమతించింది. ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను ఎస్కార్టు లేకపోవడంతో కోర్టులో హాజరుపరచలేమంటూ చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ లేఖ రాశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారి రిమాండును జూన్‌ 11కు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసు విచారణను జూన్‌ 11కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు