అడుగంటిన గుండ్లకమ్మ

ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు.

Published : 18 May 2024 03:08 IST

ఎర్రబాలెం సమీపంలో జలాశయంలో గడ్డి సాగు

ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు. పొలాల వరకూ నీరందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా జలాశయంలోనే సాగు చేపట్టారు. మరోవైపు ఇన్నాళ్లు ముంపులో ఉన్న గ్రామాలు ఒక్కోటి బయటపడుతున్నాయి.

బయటపడిన ఘడియపూడి, గార్లపాడు గ్రామాలు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఘడియపూడి, గార్లపాడు, కొరిశపాడు మండలానికి చెందిన రెండు గ్రామాలు 15 ఏళ్ల తర్వాత బయటికి కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ప్రస్తుతం అక్కడికి వెళ్లి గతంలో నివాసం ఉన్న ఇళ్లను చూసి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

న్యూస్‌టుడే, మేదరమెట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని