కూలి అడిగినందుకు కులం పేరుతో దూషించారు

కూలి అడిగినందుకు కులం పేరుతో దూషించి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దళిత కూలీలు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనాను శుక్రవారం సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

Published : 18 May 2024 03:35 IST

సీఈవోకు ఫిర్యాదు చేసిన బాధితులు

ఫిర్యాదు చేసిన అనంతరం సచివాలయం ఎదుట కూలీలు

ఈనాడు, అమరావతి: కూలి అడిగినందుకు కులం పేరుతో దూషించి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దళిత కూలీలు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనాను శుక్రవారం సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ‘ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు బ్యారన్‌లో పనిచేయడానికి ఒక్కొక్కరికి రూ.87,500 చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు నుంచి 26 మంది పనిచేయడానికి వెళ్లాం. నిర్వాహకులు ముందస్తుగా రూ.7 లక్షలు ఇచ్చారు. 10 రోజుల కిందటే పనులు పూర్తయినా.. మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారు. గత నెల 18న కూలి మొత్తం ఇవ్వాలని అడిగితే కులం పేరుతో దూషించారు. దీనిపై కొండపి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదు’ అని బాధితులు సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన సీఈవో.. దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని