విజయనగరంలో జిందాల్‌ పరిశ్రమ మూసివేత

ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్‌ జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది.

Published : 18 May 2024 04:55 IST

ఆకస్మిక నిర్ణయంతో కార్మికుల ఆందోళన

ఈనాడు-విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్‌ జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. ముడిసరకు అందుబాటులో లేకపోవడం, స్థానికంగా తయారైన స్టీలు ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్‌లో తగిన ధర రాకపోవడం, ఆర్థిక నష్టాలు తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్య ప్రతినిధి దినేష్‌శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం యథావిధిగా విధులకు హాజరైన కార్మికులకు పరిశ్రమ మూసివేత నోటీసు అందడంతో ఆందోళన చెందారు. పరిశ్రమ మూసివేస్తే రోడ్డున పడతామని నిరసన చేపట్టారు. వీరికి టీఎన్‌టీయూసీ, సీఐటీయూ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని