వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి

తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్‌చాట్‌ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు.

Updated : 18 May 2024 05:09 IST

తితిదేకు మహబూబ్‌నగర్‌ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశం

మహబూబ్‌నగర్‌ న్యాయ విభాగం, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్‌చాట్‌ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన సుమిత్రాశెట్టి, ఆమె కుమారుడు హరీశ్‌శెట్టి దాఖలు చేసిన రెండు వేర్వేరు ఫిర్యాదుల ప్రకారం.. ‘మేల్‌చాట్‌ వస్త్రం’ ఆర్జిత సేవలో పాల్గొనేందుకు సుమిత్రాశెట్టి 21.08.2007లో రూ.12,500 చెల్లించారు. హరీశ్‌శెట్టి 17.12.2008న ‘తిరుప్పావడ’ సేవ నిమిత్తం రూ.5 వేలు చెల్లించారు. హరీశ్‌శెట్టికి 9.9.2021, సుమిత్రాశెట్టికి 10.09.2021 తేదీల్లో సేవలను తితిదే ఖరారు చేసింది. కానీ తర్వాత కొవిడ్‌ కారణంగా తితిదే అన్ని సేవలను రద్దు చేసింది. ఆ తర్వాత సుమిత్రాశెట్టి అదనంగా మరో రూ.3,065 పంపించి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. అదనపు డీడీని తిరిగి వారికే పంపిస్తూ వీలు కాదని తితిదే లేఖరాసింది. దీంతో వారిద్దరూ తితిదేకి లీగల్‌ నోటీసులు పంపించారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపై తితిదే స్పందించి తమ కేసు కొట్టి వేయాలని, వారు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ఫోరాన్ని కోరింది. ఫిర్యాదులపై విచారణ చేసిన ఫోరం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని