ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్‌ కాల్స్‌

ఆర్టీసీ ఎండీ సిహెచ్‌.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్‌ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్‌ కాల్స్‌ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు యత్నించారు.

Published : 19 May 2024 04:02 IST

అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఎండీ సిహెచ్‌.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్‌ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్‌ కాల్స్‌ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు యత్నించారు. ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై.. సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైం సీఐ కోమాకుల శివాజీ తక్షణమే స్పందించి.. సదరు కాల్స్‌ వివరాలు సేకరించారు. ఝార్ఖండ్‌ నుంచి వస్తున్నట్లుగా తెలుసుకుని బ్లాక్‌ చేశారు. ‘నా ఫొటోతో ఎవరైనా వాట్సప్‌ కాల్స్‌ లేదా సందేశాలు పంపితే ఎవరూ స్పందించవద్దు. ఆ నంబరు నకిలీది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’ అని తిరుమలరావు సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు