సిట్‌ పర్యటన వేళ పల్నాడులో కేసులు

పోలింగ్‌ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం.

Updated : 19 May 2024 05:10 IST

అరెస్టులకూ ఉపక్రమించిన పోలీసులు 

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పోలింగ్‌ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. ఇన్నిరోజులు పట్టనట్టు ఉన్న పోలీసులు.. సిట్‌ వచ్చిన రోజునే అధిక సంఖ్యలో కేసులు నమోదు చేస్తుండడం అనుమానాలకు భా¦విస్తోంది. నిందితులపై కేసులు నమోదు చేస్తూ, అరెస్టూ చేస్తున్నారు. జిల్లాలో పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్ల సందర్భంగా వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఒక్క గురజాల నియోజకవర్గంలోనే వందకు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా దాచేపల్లి మండలంలో 70 మందిపై, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు పెట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు పెట్టి, దాదాపు 70 మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసుల్లో 99 మంది నిందితులను గుర్తించారు.

నరసరావుపేటలో నియోజకవర్గంలో 20కు పైగా కేసుల్లో 60 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట వన్‌ టౌన్‌ పరిధిలో జరిగిన గొడవల్లో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కేసులు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టారు? అనే విషయాలను పోలీసులు వెల్లడించడం లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరగడం, కొన్నిచోట్ల ఇద్దరూ దాడుల్లో స్వయంగా పాల్గొన్నారు. అందుకే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కేసులను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్లను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కారంపూడిలో ఈనెల 14న జరిగిన దాడి ఘటనలో ఇప్పటివరకూ తెదేపాలో 8 మందిని, వైకాపాకు చెందిన 11 మందిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు