సింహాచలంలో విద్యుత్‌ బస్సు

తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్‌ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు శనివారం ప్రారంభించారు.

Updated : 19 May 2024 12:08 IST

విద్యుత్‌ బస్సు వద్ద అశోక్‌ గజపతిరాజు, ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి, అధికారులు

సింహాచలం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్‌ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బస్సు ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదనను కాదనుకుని.. విద్యుత్‌ బస్సుల ద్వారా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాం. గోశాల ఆవరణలోని సౌర విద్యుత్‌ కేంద్రం ద్వారా దేవస్థానం.. ఏటా 12 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. రెండు లక్షల యూనిట్ల విద్యుత్‌ మిగులులో ఉంది. ఈ విద్యుత్‌తో బస్సులను నడుపుతాం’ అని వెల్లడించారు. రెండున్నర గంటలపాటు ఛార్జింగ్‌ పెడితే బస్సు 225 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆలయ ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. త్వరలో మరో బస్సు అందుబాటులోకి వస్తుందన్నారు. రూ. 18 లక్షల వ్యయంతో ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు