ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై గవర్నర్‌కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు.

Published : 19 May 2024 03:49 IST

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై గవర్నర్‌కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన సంస్కరణలను అమలు చేయడంలో హేమచంద్రారెడ్డి విఫలమయ్యారని, గత నాలుగేళ్లలో ఆయన పనితీరుపై విచారణ జరిపించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఓ ఫిర్యాదులో పేర్కొన్నారు.. జేఎన్‌టీయూ అనంతపురంలో హేమచంద్రారెడ్డిని ప్రొఫెసర్‌గా నియమించే సమయంలో యూజీసీ నిబంధనలను పాటించలేదని కేరళలోని జాతీయ న్యాయ విద్యాలయం మాజీ డీన్‌ మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని